Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 164

Question 164 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q164 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Directions (Q.No 163 and 164) : Study the following information carefully and answer the questions given below. Following are the conditions for selecting a senior clerk in a company. The candidate must (i) get atleast 50% marks in screening test (ii) have a graduate degree with atleast 60% marks (iii) have computer course certificate in Microsoft office (iv) have less than 28 years of age as on 1.6.2022 (v) have atleast 55% marks in S.S.C. In case a candidate (a) who doesn't satisfy (i) above, but has secured atleast 70% marks in graduate degree and atleast 45% marks in screening test, will be recruited as junior clerk. (b) who doesn't satisfy (ii) above, but has work experience of atleast one year in a company and atleast 50% marks in graduate degree, will be recruited as Head clerk. Mr. X was born on 4th August, 1994 and completed the Microsoft office course. He has secured 60% in screening test and 62% in S.S.C. He has completed his graduate degree with 56% marks. He has worked as a clerk in a company for 11 months. Then Mr. X

    1. Can be recruited as Senior clerk
    2. Can be recruited as Junior clerk
    3. Can be recruited as Head clerk
    4. Cannot be recruited

    నిర్దేశికాలు (ప్రశ్న 163 మరియు 164) : క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు క్రింద యివ్వబడిన ప్రశ్నలకు సమాధానమివ్వండి. ఒక కంపెనీలో ప్రాబెషనరీ సీనియర్ క్లర్క్‌ను ఎంపిక చేసుకోవడానికి నిబంధనలు క్రింద ఉన్నాయి. అభ్యర్థి : (i) స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. (ii) కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. (iii) మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. (iv) 1.6.2022 నాటికి 28 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. (v) S.S.C. లో కనీసం 55% మార్కులు పొంది ఉండాలి. ఒకవేళ అభ్యర్థి : (a) పైనున్న (i) ని నెరవేర్చలేకపోయి ఉండి, కనీసం 70% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 45% మార్కులు పొంది ఉంటే, జూనియర్ క్లర్క్‌గా నియమిస్తారు. (b) పైనున్న (ii) ను నెరవేర్చలేకపోయి ఉండి, ఒక కంపెనిలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం మరియు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉంటే, హెడ్ క్లర్క్‌గా నియమిస్తారు. Mr. X, 1994 ఆగస్టు 4 వ తేదీన జన్మించాడు మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోర్సు పూర్తి చేశాడు. అతను స్క్రీనింగ్ టెస్ట్‌లో 60% మరియు S.S.C. లో 62% పొందాడు. అతను తన గ్రాడ్యూయేట్ డిగ్రీని 56% మార్కులతో పూర్తి చేశాడు. ఒక కంపెనీలో క్లర్క్‌గా 11 నెలలు పని చేశాడు. అయితే Mr. X ను

    1. సీనియర్ క్లర్క్‌గా నియమించవచ్చును
    2. జూనియర్ క్లర్క్‌గా నియమించవచ్చును
    3. హెడ్ క్లర్క్‌గా నియమించవచ్చును
    4. నియామకానికి అర్హుడు కాదు
    Show answer

    Answer: (4) Cannot be recruited

    సమాధానం: (4) నియామకానికి అర్హుడు కాదు

    Mr. X is 27 on 1.6.2022 and meets (i), (iii), (iv) and (v), but his 56% in the degree fails (ii); exception (b) for Head clerk needs at least one year of work experience, and he has only 11 months, so he cannot be recruited.

    1.6.2022 నాటికి Mr. X వయస్సు 27, అతను (i), (iii), (iv) మరియు (v) లను నెరవేరుస్తాడు, కానీ డిగ్రీలో 56% కాబట్టి (ii) నెరవేరలేదు; హెడ్ క్లర్క్ కోసం ఉన్న మినహాయింపు (b) కి కనీసం ఒక సంవత్సరం పని అనుభవం అవసరం, అతనికి 11 నెలల అనుభవం మాత్రమే ఉంది, కాబట్టి అతను నియామకానికి అర్హుడు కాదు.

Answer it in the practice appMake a topic-wise quiz