Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Mental Ability PYQs

Every Mental Ability question asked in the APPSC Group-II papers on this site, grouped by topic. Answers come from APPSC's final keys; each has a short explanation.

Practise Mental Ability online

Numbers & Series

  1. Screening 2024 · Q121 · Mental Ability · Numbers & Series

    Study the following arrangement carefully: DE*9E$P#6+U0$H1A2D&#AS2ΩA3DS9ALM# What should come in place of the question mark (?) in the following sequence based on the above arrangement? DE* 9$P 60$ A#A ?

    1. A9A
    2. AAL
    3. AS9
    4. ALA

    ఈ క్రింది ఏర్పాటును జాగ్రత్తగా అధ్యయనం చేయండి : DE*9E$P#6+U0$H1A2D&#AS2ΩA3DS9ALM# పై అమరిక ఆధారంగా క్రింది క్రమంలోని ప్రశ్నార్థక గుర్తు (?) స్థానంలో ఏమి ఉండాలి ? DE* 9$P 60$ A#A ?

    1. A9A
    2. AAL
    3. AS9
    4. ALA
    Show answer

    Answer: (2) AAL

    సమాధానం: (2) AAL

    Each group starts at positions 1, 4, 9 and 16 (square numbers) and takes the next items at growing gaps: (1,2,3), (4,6,7), (9,12,13), (16,20,21). The next group is (25,30,31) = A, A, L.

  2. Screening 2024 · Q122 · Mental Ability · Numbers & Series

    Rajesh codes the alphabets as numbers such that a=1, b=2, c=3 and so on. What value does Rajesh get by adding all the letters (according to the code given to each letter) in the word 'pneumonoultramicroscopicsilicovolcanoconiosis'?

    1. 524
    2. 536
    3. 548
    4. 560

    రాజేష్ వర్ణమాలలోని అక్షరాలను a=1, b=2, c=3 మొదలైన సంఖ్యలుగా కోడ్ చేసాడు, అప్పుడు 'pneumonoultramicroscopicsilicovolcanoconiosis' అనే పదంలోని అన్ని అక్షరాలను జోడించడం (ఆ అక్షరానికి ఇచ్చిన కోడ్ ప్రకారం) ద్వారా రాజేష్ పొందిన విలువ ఎంత?

    1. 524
    2. 536
    3. 548
    4. 560
    Show answer

    Answer: (4) 560

    సమాధానం: (4) 560

    Adding the positions of all 45 letters (p=16, n=14, e=5, u=21 and so on) gives 560.

  3. Screening 2024 · Q129 · Mental Ability · Numbers & Series

    If in a certain code language 'CONSERVE' is written as 'BDNPMORTDFQSUWDF', how will 'NUMEROUS' be written in that code?

    1. MOTVLNEFQSNPTVRT
    2. MOTVLNFFQSOPTVRT
    3. MOTVLNDFQSNPTVRT
    4. MOTVLKDFQSNPTVRT

    ఒక నిర్దిష్ట కోడ్ భాషలో 'CONSERVE'ని 'BDNPMORTDFQSUWDF' అని వ్రాస్తారు, అదే కోడ్ భాషలో 'NUMEROUS' ఎలా వ్రాయబడుతుంది ?

    1. MOTVLNEFQSNPTVRT
    2. MOTVLNFFQSOPTVRT
    3. MOTVLNDFQSNPTVRT
    4. MOTVLKDFQSNPTVRT
    Show answer

    Answer: (3) MOTVLNDFQSNPTVRT

    సమాధానం: (3) MOTVLNDFQSNPTVRT

    Each letter is replaced by the letters just before and after it (C → BD, O → NP). So N → MO, U → TV, M → LN, E → DF, R → QS, O → NP, U → TV, S → RT.

  4. Screening 2024 · Q136 · Mental Ability · Numbers & Series

    If AB × DED = AB AB, AB × DEDED = AB AB AB, ABC × DEED = ABC ABC, and DED + DEDED + DEED = DDFEG, where A, B, C, D, E, F and G are different digits, what is the value of F × G?

    1. 2
    2. 4
    3. 6
    4. 8

    AB × DED = AB AB, AB × DEDED = AB AB AB, ABC × DEED = ABC ABC, మరియు DED + DEDED + DEED = DDFEG, A, B, C, D, E, F మరియు G వేర్వేరు అంకెలు అయితే, F × G విలువ ఎంత ?

    1. 2
    2. 4
    3. 6
    4. 8
    Show answer

    Answer: (3) 6

    సమాధానం: (3) 6

    AB × 101 = ABAB, so D = 1 and E = 0. Then 101 + 10101 + 1001 = 11203 = DDFEG, so F = 2, G = 3 and F × G = 6.

  5. Screening 2024 · Q139 · Mental Ability · Numbers & Series

    Some equations are solved on the basis of a certain rule. Following the same rule, find the missing number (?): 2 [4] 3 = 14, 4 [6] 5 = 32, 5 [7] 6 = 44, 6 [8] 7 = ?

    1. 50
    2. 54
    3. 58
    4. 60

    కొన్ని సమీకరణాలు నిర్దిష్ట నియమం ఆధారంగా పరిష్కరించబడతాయి. అదే నియమాన్ని అనుసరించి ప్రశ్నార్థక (?) స్థానంలోని సంఖ్యను కనుగొనండి : 2 [4] 3 = 14, 4 [6] 5 = 32, 5 [7] 6 = 44, 6 [8] 7 = ?

    1. 50
    2. 54
    3. 58
    4. 60
    Show answer

    Answer: (3) 58

    సమాధానం: (3) 58

    a [b] c = a × c + 2b: 2×3 + 8 = 14, 4×5 + 12 = 32, 5×6 + 14 = 44, so 6×7 + 16 = 58.

  6. Screening 2024 · Q141 · Mental Ability · Numbers & Series

    Siva defines a number as 'connected with 9' if it is divisible by 9, or if the sum of its digits is 9, or if 9 is one of the digits of the number; all other numbers are 'not connected with 9'. As per his definition, the number of integers from 1 to 90 (both included) which are NOT connected with 9 is:

    1. 45
    2. 63
    3. 72
    4. 81

    ఏ సంఖ్య అయితే 9 ద్వారా భాగించబడుతుందో లేదా ఆ సంఖ్యలో అంకెల మొత్తం 9 అవుతుందో లేదా 9 ఆ సంఖ్యలో ఒక అంకె అయితే అటువంటి సంఖ్యలు 9తో అనుసంధానించబడినవి మరియు మిగిలిన సంఖ్యలు అన్ని 9తో అనుసంధానించబడినవి కావు అని శివ నిర్వచించాడు. అతని నిర్వచనం ప్రకారం 1 నుండి 90 (1 మరియు 90 రెండూ కలుపుకొని) వరకు 9తో అనుసంధానించబడని పూర్ణాంకాల సంఖ్య ఎంత :

    1. 45
    2. 63
    3. 72
    4. 81
    Show answer

    Answer: (3) 72

    సమాధానం: (3) 72

    The multiples of 9 up to 90 (10 numbers) cover every number with digit sum 9. Numbers containing the digit 9 add 19, 29, 39, 49, 59, 69, 79 and 89 (8 more). So 18 are connected and 90 – 18 = 72 are not.

  7. Screening 2024 · Q143 · Mental Ability · Numbers & Series

    Find the odd one out in the following series: 2, 4, 7, 11·5, 18·25, 28·375, 42·5625

    1. 11·5
    2. 7
    3. 28·375
    4. 42·5625

    ఈ క్రింది వరుసలో తప్పుగా ఉన్న సంఖ్యను గుర్తించండి : 2, 4, 7, 11·5, 18·25, 28·375, 42·5625

    1. 11·5
    2. 7
    3. 28·375
    4. 42·5625
    Show answer

    Answer: (4) 42·5625

    సమాధానం: (4) 42·5625

    The differences 2, 3, 4.5, 6.75, 10.125 grow by a factor of 1.5, so the next difference is 15.1875 and the last term should be 43.5625, not 42.5625.

  8. Mains 2019 · P-I · Q45 · Mental Ability · Numbers & Series

    MEAN : 11 :: MORE : ?

    మీన్ : 11 :: మోర్ : ?

    Show answer

    Answer: 17

    సమాధానం: 17

    The rule is the sum of letter positions divided by 3. MEAN = 13+5+1+14 = 33, and 33 ÷ 3 = 11. MORE = 13+15+18+5 = 51, and 51 ÷ 3 = 17.

Reasoning

  1. Screening 2024 · Q123 · Mental Ability · Reasoning

    Directions: YSR Kadapa team has to play cricket matches with Visakhapatnam team as a part of 'Aadudam Andhra'. Each team must have exactly 5 players chosen from these eight: A – Batsman – ₹5,000; B – Batsman – ₹5,500; C – Batsman/part-time wicketkeeper – ₹6,500; D – Specialist wicketkeeper – ₹5,500; E – Bowler (Spin) – ₹5,000; F – Bowler (Fast) – ₹6,000; G – Bowler (Spin) – ₹5,500; H – Bowler (Fast) – ₹5,500. Conditions: (1) B and C cannot be selected together. (2) A wicketkeeper is a must. (3) E and G cannot be selected together. (4) Among E, F, G and H, only two are to be selected. (5) If A is selected, H must be selected. (6) At least two batsmen and two bowlers. (7) C counts as both a batsman and a wicketkeeper. YSR Kadapa team decides to compose the team with one fast bowler and one spinner and has a budget of only ₹26,500. Who among the following is NOT a member of that team?

    1. A
    2. E
    3. H
    4. G

    సూచనలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆడుదాం ఆంధ్ర'లో భాగంగా వైఎస్ఆర్ కడప జట్టు విశాఖపట్నం జట్టుతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రతి జట్టులోని ఆటగాళ్ల సంఖ్య తప్పనిసరిగా 5 మాత్రమే ఉండాలి. క్రింద ఇవ్వబడిన ఎనిమిది మంది ఆటగాళ్లలో రెండు జట్లూ 5 మంది ఆటగాళ్లను ఎంచుకోవాలి : A – బ్యాట్స్‌మాన్ – ₹5,000; B – బ్యాట్స్‌మాన్ – ₹5,500; C – బ్యాట్స్‌మాన్/పార్ట్ టైమ్ వికెట్‌కీపర్ – ₹6,500; D – స్పెషలిస్ట్ వికెట్‌కీపర్ – ₹5,500; E – బౌలర్ (స్పిన్) – ₹5,000; F – బౌలర్ (ఫాస్ట్) – ₹6,000; G – బౌలర్ (స్పిన్) – ₹5,500; H – బౌలర్ (ఫాస్ట్) – ₹5,500. షరతులు : (1) B మరియు C లను కలిపి ఎంపిక చేయడం సాధ్యం కాదు. (2) జట్టులో వికెట్‌కీపర్ తప్పనిసరిగా ఉండాలి. (3) E మరియు G లను కలిపి ఎంపిక చేయడం సాధ్యం కాదు. (4) E, F, G మరియు Hలలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎంపిక చేయబడతారు. (5) A ఎంపిక చేయబడితే, H ని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. (6) జట్టులో కనీసం ఇద్దరు బ్యాట్స్‌మాన్ మరియు ఇద్దరు బౌలర్లు ఉండాలి. (7) C ని బ్యాట్స్‌మాన్ మరియు వికెట్‌కీపర్‌గా పరిగణించాలి. వైఎస్ఆర్ కడప జట్టు ఒక ఫాస్ట్ బౌలర్ మరియు ఒక స్పిన్నర్‌తో జట్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది మరియు జట్టును ఏర్పాటు చేయడానికి కేవలం ₹ 26,500 బడ్జెట్ మాత్రమే ఉంది. అప్పుడు అన్ని షరతులను సంతృప్తిపరిచిన యెడల ఈ క్రింది వారిలో ఎవరు ఆ బృందంలో సభ్యుడు కాదు ?

    1. A
    2. E
    3. H
    4. G
    Show answer

    Answer: (4) G

    సమాధానం: (4) G

    Three players must come from A, B, C, D. Every valid trio includes A, so H must be the fast bowler. The cheapest team is A, B, D, H plus spinner E, costing exactly ₹26,500, so G is left out.

  2. Screening 2024 · Q124 · Mental Ability · Reasoning

    (Same data and conditions as the previous question.) If the stadium is favourable to spin bowling and YSR Kadapa team decided to select C and G compulsorily, what is the total amount spent on the selected players satisfying all the conditions?

    1. ₹27,000
    2. ₹27,500
    3. ₹28,000
    4. ₹28,500

    (పై ప్రశ్నలోని సమాచారం మరియు షరతులే.) స్పిన్ బౌలింగ్‌కు స్టేడియం అనుకూలమని తెలిసి వైఎస్ఆర్ కడప టీమ్ C మరియు G ని తప్పకుండా ఎంపిక చేయాలని నిర్ణయించింది, అప్పుడు అన్ని షరతులను వర్తింపజేసి ఎంపిక చేసిన ఆటగాళ్లకు జట్టు ఖర్చు చేసిన మొత్తం ఎంత ?

    1. ₹ 27,000
    2. ₹ 27,500
    3. ₹ 28,000
    4. ₹ 28,500
    Show answer

    Answer: (3) ₹28,000

    సమాధానం: (3) ₹ 28,000

    C rules out B and G rules out E. A second batsman is needed, so A is picked, which forces H. D fills the fifth place. C + G + A + H + D = 6,500 + 5,500 + 5,000 + 5,500 + 5,500 = ₹28,000.

  3. Screening 2024 · Q125 · Mental Ability · Reasoning

    (Same data and conditions as the previous questions.) If the stadium is favourable to fast bowling and YSR Kadapa team decided to compose the team with two fast bowlers, what would be the least amount that can be spent to form a team satisfying all the conditions?

    1. ₹26,500
    2. ₹27,000
    3. ₹27,500
    4. ₹28,000

    (పై ప్రశ్నలలోని సమాచారం మరియు షరతులే.) స్టేడియం ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిసి వైఎస్ఆర్ కడప జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో జట్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది, అప్పుడు అన్ని షరతులను సంతృప్తిపరిచి జట్టును ఏర్పాటు చేయడానికి ఖర్చు చేయగల తక్కువ మొత్తం ఎంత ?

    1. ₹ 26,500
    2. ₹ 27,000
    3. ₹ 27,500
    4. ₹ 28,000
    Show answer

    Answer: (3) ₹27,500

    సమాధానం: (3) ₹ 27,500

    F and H are the bowlers (₹11,500). The cheapest valid trio from A, B, C, D is A, B, D (₹16,000), giving a total of ₹27,500.

  4. Screening 2024 · Q126 · Mental Ability · Reasoning

    Read the following instructions: A$D means 'A is to the North of D'; A&D means 'A is to the East of D'; A*D means 'D is to the West of A'; A%D means 'D is to the South of A'; A@DR means 'A stands exactly in the middle of the horizontal line DR'; A!DR means 'A stands exactly in the middle of the vertical line DR'. 'A6m$D' means 'A is 6 metres to the north of D' and so on. Find the shortest distance between S and T in the expression: 'B12m$S5m*R3m&J6m%K!JT'

    1. 4√13 m
    2. 10·23 m
    3. 2√13 m
    4. 3√13 m

    ఈ క్రింది సూచనలను చదవండి : A$D అంటే 'A అనేది Dకి ఉత్తరాన ఉంది'; A&D అంటే 'A అనేది D కి తూర్పున ఉంది'; A*D అంటే 'D అనేది A కి పశ్చిమాన ఉంది'; A%D అంటే 'D అనేది A కి దక్షిణాన ఉంది'; A@DR అంటే 'A ఖచ్చితంగా DR యొక్క సమాంతర రేఖ మధ్యలో ఉంటుంది'; A!DR అంటే 'A ఖచ్చితంగా DR యొక్క నిలువు రేఖ మధ్యలో ఉంటుంది'. 'A6m$D' అంటే 'A అనేది Dకి ఉత్తరంగా 6 మీటర్లు దూరం లో ఉంది' అని అర్థం చేసుకోవాలి. ఈ క్రింది వ్యక్తీకరణలో S మరియు T మధ్య అతి తక్కువ దూరాన్ని కనుగొనండి : 'B12m$S5m*R3m&J6m%K!JT'

    1. 4√13 మీ
    2. 10·23 మీ
    3. 2√13 మీ
    4. 3√13 మీ
    Show answer

    Answer: (1) 4√13 m

    సమాధానం: (1) 4√13 మీ

    Take S at (0, 0). R is 5 m west of S, at (–5, 0). J is 3 m west of R, at (–8, 0). K is 6 m south of J, and as K is the midpoint of JT, T is at (–8, –12). ST = √(8² + 12²) = √208 = 4√13 m.

  5. Screening 2024 · Q134 · Mental Ability · Reasoning

    Directions: On the occasion of unveiling the Statue of Social Justice, the Government of Andhra Pradesh set up an exhibition and stalls at PWD grounds, Vijayawada. Raghu went to visit 8 stalls (Stall-1 to Stall-8, not necessarily in that order). He started from Stall-1 and walked towards Stall-3, which is 24 m towards the East. He then turned left and walked 16 m to reach Stall-5. Then he walked 57 m south-west to visit Stall-2, which is towards the South of Stall-1, crossing the path which goes through the midpoint of the line joining Stall-1 and Stall-3. After visiting Stall-2, he walked 40 m in the East direction and reached Stall-7. He then walked 50 m left to reach Stall-8, then 16 m right to reach Stall-4, and to reach the last stall he walked 35 m towards the right. What is the shortest distance between Stall-3 and Stall-6?

    1. 6√87 m
    2. 4√89 m
    3. 4√77 m
    4. 8√24 m

    సూచనలు : స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ మరియు స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. రఘు 8 స్టాల్‌లను సందర్శించడానికి ఎగ్జిబిషన్‌కు వెళ్లాడు- స్టాల్-1, స్టాల్-2, స్టాల్-3, స్టాల్-4, స్టాల్-5, స్టాల్-6, స్టాల్-7, స్టాల్-8, కానీ అదే క్రమంలో సందర్శించలేదు. అతను స్టాల్-1 నుండి ప్రారంభించి తూర్పు వైపు 24 మీటర్ల దూరంలో ఉన్న స్టాల్-3 వైపు నడిచాడు. అక్కడి నుండి ఎడమవైపుకు తిరిగి 16మీ నడిచి స్టాల్-5కి చేరుకున్నాడు. అక్కడి నుండి అతను స్టాల్-1 మరియు స్టాల్-3ని కలిపే రేఖ మధ్యలో ఉన్న మార్గాన్ని దాటి, స్టాల్-1కి దక్షిణంగా ఉన్న స్టాల్-2ని సందర్శించడానికి నైరుతి దిశలో 57మీ నడిచాడు. స్టాల్-2ను సందర్శించిన తర్వాత తూర్పు దిశలో 40మీటర్లు నడిచి స్టాల్-7కి చేరుకున్నాడు. అక్కడి నుండి అతను స్టాల్-8కి చేరుకోవడానికి ఎడమవైపు 50మీ నడిచి, ఆపై స్టాల్-4కి చేరుకోవడానికి కుడివైపు 16మీ నడిచాడు మరియు చివరి స్టాల్‌కి చేరుకోవడానికి అక్కడి నుండి కుడివైపు 35మీ నడిచాడు. స్టాల్-3 మరియు స్టాల్-6 మధ్య అతి తక్కువ దూరం ఎంత ?

    1. 6√87 మీ
    2. 4√89 మీ
    3. 4√77 మీ
    4. 8√24 మీ
    Show answer

    Answer: (2) 4√89 m

    సమాధానం: (2) 4√89 మీ

    With Stall-1 at (0, 0): Stall-3 (24, 0), Stall-5 (24, 16), Stall-2 (0, –35), Stall-7 (40, –35), Stall-8 (40, 15), Stall-4 (56, 15) and Stall-6 (56, –20). Stall-3 to Stall-6 = √(32² + 20²) = √1424 = 4√89 m.

  6. Screening 2024 · Q135 · Mental Ability · Reasoning

    (Same arrangement as the previous question.) What is the direction of Stall-1 with respect to Stall-2, and the shortest distance between them?

    1. North-East, 7√10 m
    2. North-West, 7√10 m
    3. North, 35 m
    4. North, 39 m

    (పై ప్రశ్నలోని అమరికే.) స్టాల్-2కి సంబంధించి స్టాల్-1 ఏ దిశలో ఉంది మరియు వాటి మధ్య అతి తక్కువ దూరం ఎంత ?

    1. ఈశాన్యం, 7√10 మీ
    2. వాయువ్యం, 7√10 మీ
    3. ఉత్తరం, 35 మీ
    4. ఉత్తరం, 39 మీ
    Show answer

    Answer: (3) North, 35 m

    సమాధానం: (3) ఉత్తరం, 35 మీ

    Stall-2 is directly south of Stall-1, at (0, –35), so Stall-1 is 35 m to the North of Stall-2.

  7. Screening 2024 · Q140 · Mental Ability · Reasoning

    Arun finds the letters to be placed in the place of '?' and '!' in the figure given, and by combining and arranging those four letters, he finds the name of a country. The capital city of that country is:

    Figure for question 140
    1. Quito
    2. La Paz
    3. Lima
    4. Georgetown

    ఈ క్రింద ఇచ్చిన బొమ్మలోని '?' మరియు '!' స్థానంలో ఉండాల్సిన అక్షరాలను అరుణ్ కనుగొన్నాడు మరియు ఇచ్చిన ఆ నాలుగు అక్షరాలను కలపడం మరియు అమర్చడం ద్వారా అతను ఒక దేశం యొక్క పేరు గుర్తించాడు. ఆ దేశ యొక్క రాజధాని ఏది ?

    1. క్విటో
    2. లా పాజ్
    3. లిమా
    4. జార్జ్‌టౌన్
    Show answer

    Answer: (3) Lima

    సమాధానం: (3) లిమా

    In each square the three numbers add up to the alphabet position of the letter: 9+5+7 = 21 (U), 2+1+2 = 5 (E), 7+4+5 = 16 (P), 6+9+3 = 18 (R). The letters spell PERU, whose capital is Lima.

  8. Screening 2024 · Q142 · Mental Ability · Reasoning

    Read the following instructions: A3B means 'A is the Mother of B'; A11B means 'A is the Brother of B'; A9B means 'A is the Father of B'; A12B means 'A is the Sister of B'. Which of the following expressions means that P is the maternal uncle of Q?

    1. Q11N3M12P
    2. P3S12N11Q
    3. P11M3N12Q
    4. Q11S9P

    ఈ క్రింది సూచనలను చదవండి : A3B అనగా 'A అంటే B యొక్క తల్లి'; A11B అనగా 'A అంటే B యొక్క సోదరుడు'; A9B అనగా 'A అంటే B యొక్క తండ్రి'; A12B అనగా 'A అంటే B యొక్క సోదరి'. P అనువాడు Q యొక్క మేనమామగా క్రింది వ్యక్తీకరణలలో ఏది చూపుతుంది ?

    1. Q11N3M12P
    2. P3S12N11Q
    3. P11M3N12Q
    4. Q11S9P
    Show answer

    Answer: (3) P11M3N12Q

    సమాధానం: (3) P11M3N12Q

    P11M: P is M's brother. M3N: M is N's mother. N12Q: N is Q's sister, so M is also Q's mother. P is the brother of Q's mother, that is, Q's maternal uncle.

  9. Screening 2024 · Q146 · Mental Ability · Reasoning

    Find the number of triangles and squares in the following figure:

    Figure for question 146
    1. 21 Triangles and 8 Squares
    2. 20 Triangles and 8 Squares
    3. 22 Triangles and 7 Squares
    4. 21 Triangles and 7 Squares

    ఈ క్రింది చిత్రంలో త్రిభుజాలు మరియు చతురస్రాల సంఖ్యను కనుగొనండి :

    1. 21 త్రిభుజాలు మరియు 8 చతురస్రాలు
    2. 20 త్రిభుజాలు మరియు 8 చతురస్రాలు
    3. 22 త్రిభుజాలు మరియు 7 చతురస్రాలు
    4. 21 త్రిభుజాలు మరియు 7 చతురస్రాలు
    Show answer

    Answer: (4) 21 Triangles and 7 Squares

    సమాధానం: (4) 21 త్రిభుజాలు మరియు 7 చతురస్రాలు

    The final key gives 21 triangles and 7 squares. Count the small triangles inside the large triangle first, then those formed with the diamond, then the squares of the stacked rectangles.

  10. Screening 2024 · Q149 · Mental Ability · Reasoning

    Statement: Two industrialists, Shyam and Manoj, have industries right next to each other. They have been working hard for their industries' development and both of them manufacture the same product. Both spend an equal amount of time, use the same materials and are equally hardworking. During the sales period, Shyam had better product sales in comparison to Manoj's product. Conclusion I: The quality of material used by Manoj was not good. Conclusion II: Power cuts ruined the quality of Manoj's product.

    1. Only conclusion I follows
    2. Only conclusion II follows
    3. Both conclusions I and II follow
    4. Neither conclusion I nor II follows

    ప్రకటన : ఇద్దరు పారిశ్రామికవేత్తలు, శ్యామ్ మరియు మనోజ్ ఇద్దరికీ పక్క పక్కనే ఒకదానిని ఆనుకొని మరొకటి పరిశ్రమలు ఉన్నాయి. వారు తమ పరిశ్రమల అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారు మరియు ఇద్దరూ ఒకే ఉత్పత్తిని తయారు చేస్తారు. ఇద్దరూ సమాన సమయాన్ని వెచ్చిస్తారు, ఒకే పదార్థాలను ఉపయోగిస్తారు మరియు సమానంగా కష్టపడి పని చేస్తారు. విక్రయాల కాలంలో, మనోజ్ ఉత్పత్తితో పోల్చితే, శ్యామ్ మెరుగైన ఉత్పత్తి విక్రయాలను కలిగి ఉన్నాడు. నిర్ధారణ I : మనోజ్ ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత బాగా లేదు. నిర్ధారణ II : పవర్ కట్‌లు మనోజ్ ఉత్పత్తి నాణ్యతను నాశనం చేశాయి.

    1. I మాత్రమే అనుసరిస్తుంది
    2. II మాత్రమే అనుసరిస్తుంది
    3. I మరియు II లు రెండూ అనుసరిస్తాయి
    4. I లేదా II లు అనుసరించవు
    Show answer

    Answer: (4) Neither conclusion I nor II follows

    సమాధానం: (4) I లేదా II లు అనుసరించవు

    Both use the same materials, so I cannot follow, and nothing in the statement mentions power cuts, so II cannot follow either.

  11. Screening 2024 · Q150 · Mental Ability · Reasoning

    Statement: The civic authority has decided that all the factories located inside the city limits be shifted outside to reduce the level of environmental pollution in the city. Assumption I: The pollution level in the city in future may reduce after these factories are shifted outside the city limits. Assumption II: Enough usable land is available outside the city limits for these factories. Assumption III: Many of these factories may shift to some other smaller towns to remain profitable.

    1. Only I is implicit
    2. Only I and II are implicit
    3. Only II is implicit
    4. Only II and III are implicit

    ప్రకటన : నగరంలో పర్యావరణ కాలుష్యం స్థాయిని తగ్గించేందుకు నగర పరిధిలో ఉన్న అన్ని కర్మాగారాలను నగరం బయటికి తరలించాలని పౌర అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఊహ I : ఈ కర్మాగారాలను నగర సరిహద్దుల వెలుపలికి తరలించిన తర్వాత భవిష్యత్తులో నగరంలో కాలుష్య స్థాయి తగ్గవచ్చు. ఊహ II : ఈ కర్మాగారాల కోసం నగర పరిమితి వెలుపల తగినంత భూమి అందుబాటులో ఉంది. ఊహ III : లాభదాయకంగా ఉండటానికి ఈ కర్మాగారాల్లో చాలా వరకు ఇతర చిన్న పట్టణాలకు మారవచ్చు.

    1. I మాత్రమే అవ్యక్తమైనది
    2. I మరియు II మాత్రమే అవ్యక్తమైనవి
    3. II మాత్రమే అవ్యక్తమైనది
    4. II మరియు III మాత్రమే అవ్యక్తమైనవి
    Show answer

    Answer: (2) Only I and II are implicit

    సమాధానం: (2) I మరియు II మాత్రమే అవ్యక్తమైనవి

    The decision assumes that it will cut pollution (I) and that the factories have somewhere to go (II). Factories moving to other towns (III) is a possible result, not an assumption behind the decision.

  12. Mains 2019 · P-I · Q49 · Mental Ability · Reasoning

    Choose the pair in which the words are differently related.

    ఈ క్రింది వాటిలో ఏ జంటలు పదాలు విభిన్న సంబంధంలో ఉన్నాయి (డిఫరెంట్ లీ రిలెటెడ్)

    Show answer

    Answer: Radian : Degree

    సమాధానం: రేడియన్ : డిగ్రీ

    Radian and degree are both units of the same quantity (angle). In the other pairs one word is the unit of the other.

  13. Mains 2019 · P-I · Q146 · Mental Ability · Reasoning

    Directions: A, B, C, D, E, F and G are sitting around a circle facing the centre, not necessarily in the same order. D is not second to the left of F but D is second to the right of A. C is third to the right of A and C is second to the left of G. B is not an immediate neighbour of G. Who is to the immediate right of C?

    సూచనలు: క్రింద ఇవ్వ బడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం వ్రాయండి. ఒక వృత్తం చుట్టూ, వృత్త కేంద్రం వైపు తిరిగి A, B, C, D, E, F, మరియు G అనే వ్యక్తులు కూర్చున్నారు. వాళ్ళు నిర్దిష్టంగా ఒకే వరుసలో ఉండాలని లేదు. D అనే వ్యక్తి F కు ఎడమ వైపున రెండవ స్థానంలో లేడు కాని, A అనే వ్యక్తికి కుడి వైపున 2వ స్థానంలో ఉన్నాడు. C అనే వ్యక్తి A కు కుడి వైపున మూడవ స్థానంలో ఉన్నాడు మరియు C అనే వ్యక్తికి G ఎడమ వైపున రెండవ స్థానంలో ఉన్నాడు. B అనే వ్యక్తి, G కు ప్రక్కనే ఉన్న పొరుగువాడు కాదు. C కు వెంటనే కుడి వైపున ఉన్నవారు

    Show answer

    Answer: E

    సమాధానం: E

    Going round to the right from A, the arrangement is A, B, D, C, E, G, F. The person immediately to C's right is E.

  14. Mains 2019 · P-I · Q147 · Mental Ability · Reasoning

    (Same arrangement as the previous question.) Who is the only person sitting between A and G?

    (పై ప్రశ్నలోని అమరిక ఆధారంగా) A మరియు G మధ్యలో నున్న ఒకే ఒక వ్యక్తి:

    Show answer

    Answer: F

    సమాధానం: F

    The order to the right from A is A, B, D, C, E, G, F, so F sits alone between G and A.

  15. Mains 2019 · P-I · Q148 · Mental Ability · Reasoning

    (Same arrangement as the previous question.) Who is sitting immediately to the left of D?

    (పై ప్రశ్నలోని అమరిక ఆధారంగా) D కు వెంటనే ఎడమ వైపున ఉన్న వ్యక్తి:

    Show answer

    Answer: B

    సమాధానం: B

    In A, B, D, C, E, G, F, the person just to D's left is B.

  16. Mains 2019 · P-I · Q149 · Mental Ability · Reasoning

    (Same arrangement as the previous question.) Who is second to the left of C?

    (పై ప్రశ్నలోని అమరిక ఆధారంగా) C కు ఎడమ వైపున ఉన్న రెండవ వ్యక్తి:

    Show answer

    Answer: B

    సమాధానం: B

    Moving left from C: D, then B.

  17. Mains 2019 · P-I · Q150 · Mental Ability · Reasoning

    (Same arrangement as the previous question.) What is E's position with respect to D?

    (పై ప్రశ్నలోని అమరిక ఆధారంగా) D తో పోలిస్తే E స్థానము:

    Show answer

    Answer: Second to the right

    సమాధానం: కుడి వైపు నుండి రెండవ స్థానం

    Moving right from D: C, then E.

Arithmetic

  1. Screening 2024 · Q128 · Mental Ability · Arithmetic

    The speeds of Rohit and Lalith are 30 km/h and 40 km/h. Initially, Lalith is at place X and Rohit is at place Y. The distance between X and Y is 650 km. Rohit started his journey 3 hours earlier than Lalith to meet him. If they both meet each other at a place Z somewhere between X and Y and the distance between Y and Z is P, what is the value of P ÷ 2?

    1. 330
    2. 125
    3. 220
    4. 165

    రోహిత్ మరియు లలిత్ వేగం గంటకు 30 కి.మీ మరియు 40 కిమీ/గం ప్రారంభంలో లలిత్ X స్థానంలో మరియు రోహిత్ Y స్థానంలో ఉన్నారు. X మరియు Y మధ్య దూరం 650 కి.మీ. ఒకరినొకరు కలవడానికి లలిత్ కంటే 3 గంటల ముందుగానే రోహిత్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. X మరియు Y మధ్య ఉన్న Z స్థలంలో వారిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటే Y మరియు Z మధ్య దూరం P అయితే, అప్పుడు P ÷ 2 విలువ ఎంత ?

    1. 330
    2. 125
    3. 220
    4. 165
    Show answer

    Answer: (4) 165

    సమాధానం: (4) 165

    In 3 hours Rohit covers 90 km, leaving 560 km, which they close at 70 km/h in 8 hours. Rohit travels 11 × 30 = 330 km, so P = 330 and P ÷ 2 = 165.

  2. Screening 2024 · Q131 · Mental Ability · Arithmetic

    In the month of January, the students of Chaitanya Bharathi Public School visited M/s Swaminathan Farm, where they saw rabbits and pigeons. One student counted 340 heads and 1060 legs. He also observed that 3 pigeons (out of the total pigeons present there) were dead. How many live pigeons are there on that farm?

    1. 177
    2. 167
    3. 157
    4. 147

    జనవరి నెలలో చైతన్య భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు M/s స్వామినాథన్ ఫారమ్ ను సందర్శించారు, అక్కడ వారు కుందేళ్ళు మరియు పావురాలను చూసారు. ఒక విద్యార్థి అక్కడున్న కుందేళ్ళు మరియు పావురాల తలలు, కాళ్ళు లెక్కించడం ప్రారంభించాడు తలలు లెక్కిస్తే 340 తలలు, కాళ్లు లెక్క పెడితే 1060 కాళ్లు ఉన్నాయని గుర్తించాడు. అతను 3 పావురాలు (అక్కడ ఉన్న మొత్తం పావురాల్లో) చనిపోయాయని కూడా గమనించాడు. అప్పుడు ఆ ఫారమ్‌లో ఎన్ని సజీవ పావురాలు ఉన్నాయి ?

    1. 177
    2. 167
    3. 157
    4. 147
    Show answer

    Answer: (4) 147

    సమాధానం: (4) 147

    With r rabbits and p pigeons, r + p = 340 and 4r + 2p = 1060, so r = 190 and p = 150. Live pigeons = 150 – 3 = 147.

  3. Screening 2024 · Q132 · Mental Ability · Arithmetic

    The sum of the present ages of Ramu and his son Jagadeesh is 60 years. Six years ago, Ramu's age was five times the age of Jagadeesh. After 6 years, Jagadeesh's age will be:

    1. 12 years
    2. 14 years
    3. 16 years
    4. 20 years

    రాము మరియు అతని కుమారుడు జగదీష్‌ల ప్రస్తుత వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం రాము వయసు జగదీష్ వయసు కంటే ఐదు రెట్లు ఎక్కువ. 6 సంవత్సరాల తర్వాత జగదీష్ వయస్సు ఎంత ఉంటుంది :

    1. 12 సంవత్సరాలు
    2. 14 సంవత్సరాలు
    3. 16 సంవత్సరాలు
    4. 20 సంవత్సరాలు
    Show answer

    Answer: (4) 20 years

    సమాధానం: (4) 20 సంవత్సరాలు

    R + J = 60 and R – 6 = 5(J – 6), so 6J = 84 and J = 14. In 6 years Jagadeesh will be 20.

  4. Screening 2024 · Q133 · Mental Ability · Arithmetic

    If 2×4×6×8×10×12×14×16×18 = 18579XYZ0, what is the value of X + Y + Z?

    1. 12
    2. 13
    3. 14
    4. 15

    2X4X6X8X10X12X14X16X18=18579XYZ0 అయితే X + Y + Z విలువ ఎంత ?

    1. 12
    2. 13
    3. 14
    4. 15
    Show answer

    Answer: (4) 15

    సమాధానం: (4) 15

    The product is 2⁹ × 9! = 512 × 362880 = 185794560, so X = 4, Y = 5, Z = 6 and X + Y + Z = 15.

  5. Screening 2024 · Q137 · Mental Ability · Arithmetic

    Suneetha works as a Deputy Collector and gets a monthly salary of ₹74,000. She spends it on three heads: Personal and family expenses (P), Medical (M) and Charity (C), and the rest are her savings. P was 70% of her salary, M was 20% of P and C was 15% of M. After a salary hike, her salary is 60% higher. She maintained the same percentage for P, but M became 25% of P and C became 20% of M. The difference between the two savings is:

    1. ₹284
    2. ₹370
    3. ₹424
    4. ₹474

    సునీత డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు మరియు నెలవారీ జీతం ₹ 74,000. ఆమె దానిని మూడు పద్దులో ఖర్చు చేస్తుంది : వ్యక్తిగత మరియు కుటుంబ ఖర్చులు (P), వైద్యం (M), ఛారిటీ (C) మరియు మిగిలిన మొత్తం ఆమె పొదుపు. P ఆమె జీతంలో 70%, M యొక్క ఖర్చు Pలో 20% మరియు C యొక్క ఖర్చు Mలో 15%. ఆమె జీతం పెంపు పొందినప్పుడు, ఆమె జీతం గతం కంటే 60% పెరిగింది, ఆమె P యొక్క ఖర్చు అదే శాతాన్ని కొనసాగించింది, కానీ M యొక్క ఖర్చు Pలో 25% మరియు C యొక్క ఖర్చు M లో 20% అయింది. రెండు పొదుపుల మధ్య వ్యత్యాసం ఎంత :

    1. ₹ 284
    2. ₹ 370
    3. ₹ 424
    4. ₹ 474
    Show answer

    Answer: (2) ₹370

    సమాధానం: (2) ₹ 370

    Before: P = 51,800, M = 10,360, C = 1,554, savings = ₹10,286. After (salary ₹1,18,400): P = 82,880, M = 20,720, C = 4,144, savings = ₹10,656. Difference = ₹370.

  6. Screening 2024 · Q138 · Mental Ability · Arithmetic

    Vijay invested a sum of ₹8,192 at 15% per annum in State Bank of India. What is the compound interest on the sum for 1¼ years, if interest is compounded every 5 months?

    1. ₹1,740
    2. ₹1,735
    3. ₹1,640
    4. ₹1,634

    విజయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంవత్సరానికి 15% చొప్పున ₹ 8,192 పెట్టుబడి పెట్టాడు. ప్రతి 5 మాసాలకు వడ్డీ కలిపే పద్ధతిలో 1¼ సంవత్సరాల పాటు విజయ్ పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీ ఎంత ?

    1. ₹ 1,740
    2. ₹ 1,735
    3. ₹ 1,640
    4. ₹ 1,634
    Show answer

    Answer: (4) ₹1,634

    సమాధానం: (4) ₹ 1,634

    The rate per 5-month period is 15 × 5/12 = 6.25% (1/16), and 15 months is 3 periods. Amount = 8192 × (17/16)³ = ₹9,826, so CI = ₹1,634.

  7. Screening 2024 · Q145 · Mental Ability · Arithmetic

    Mahesh and Krishna are engaged to do a work. Mahesh working alone takes 8 hours more to complete the job than if both worked together. If Krishna worked alone, he would need 4½ hours more to complete the job than if they both worked together. How much time would they both take to do the work together?

    1. 7·4 hours
    2. 5 hours
    3. 5·3 hours
    4. 6 hours

    మహేష్ మరియు కృష్ణ ఒక పని చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేసిన దానికంటే మహేష్ ఒక్కడే పని చేయడానికి 8 గంటలు ఎక్కువ పడుతుంది. కృష్ణ ఒంటరిగా పని చేస్తే, ఇద్దరూ కలిసి పనిచేసిన దానికంటే పనిని పూర్తి చేయడానికి అతనికి 4½ గంటలు ఎక్కువ కావాలి. ఇద్దరూ కలిసి పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు ?

    1. 7·4 గంటలు
    2. 5 గంటలు
    3. 5·3 గంటలు
    4. 6 గంటలు
    Show answer

    Answer: (4) 6 hours

    సమాధానం: (4) 6 గంటలు

    When one worker takes a hours more and the other b hours more than the pair, the pair's time is √(ab). √(8 × 4.5) = √36 = 6 hours.

  8. Screening 2019 · Q37 · Mental Ability · Arithmetic

    C = 5/9 (F – 32). If C = 25, what is the value of F?

    °C = 5/9 × (°F – 32) అయితే °C = 25, °F విలువ ఎంత ?

    Show answer

    Answer: 77

    సమాధానం: 77

    25 = 5/9 (F – 32), so F – 32 = 45 and F = 77.

  9. Mains 2019 · P-I · Q1 · Mental Ability · Arithmetic

    Two students appeared at an examination. One of them secured 9 marks more than the other and his marks were 56% of the sum of their marks. The marks obtained by them are:

    ఒక పరీక్షకు ఇద్దరు అభ్యర్థులు హాజరయ్యారు. వాళ్ళలో ఒకడు రెండవ వాడి కంటే 9 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు. అతని మార్కులు వాళ్ళ మొత్తం మార్కులలో 56%. వాళ్ళు తెచ్చుకున్న మార్కులు–

    Show answer

    Answer: 42 and 33

    సమాధానం: 42, 33

    If the total is T, the gap of 9 marks is 56% – 44% = 12% of T, so T = 75. The marks are 42 and 33.

  10. Mains 2019 · P-I · Q54 · Mental Ability · Arithmetic

    The sum of three consecutive numbers is 126. Find the highest number.

    మూడు వరుస సంఖ్యల మొత్తం 126. వాటిల్లో పెద్ద సంఖ్య ఏది?

    Show answer

    Answer: 43

    సమాధానం: 43

    The middle number is 126 ÷ 3 = 42, so the numbers are 41, 42 and 43.

  11. Mains 2019 · P-I · Q67 · Mental Ability · Arithmetic

    Change the sign where necessary to make the equation correct: 28 – (3 + 4) + (2 × 2) = 0

    ఈ క్రింది ఈక్వేషన్ ను సరి దిద్దటానికి అవసరమయిన చోటు సైన్ ను మార్చండి. 28 - (3+4) + (2 x 2) = 0

    Show answer

    Answer: Change + into × (between the brackets)

    సమాధానం: + ను x గా మార్చండి

    28 – (3 + 4) × (2 × 2) = 28 – 7 × 4 = 0.

  12. Mains 2019 · P-I · Q71 · Mental Ability · Arithmetic

    A sum of ₹370 is to be divided among A, B and C such that A's share : B's share = B's share : C's share = 3 : 4. Then A's share is

    (A యొక్క వాటా / B యొక్క వాటా) = (B యొక్క వాటా / C యొక్క వాటా) = 3/4 అగునట్లు రూ 370లను A, B మరియు C లకు పంచినచో A వాటా ఎంత?

    Show answer

    Answer: ₹90

    సమాధానం: 90 రూ||లు

    A : B : C = 9 : 12 : 16, which adds up to 37 parts of ₹10 each, so A gets ₹90.

  13. Mains 2019 · P-I · Q72 · Mental Ability · Arithmetic

    The dimensions of a rectangular room, when increased by 4 m, are in the ratio 4 : 3, and when decreased by 4 m, are in the ratio 2 : 1. The dimensions of the room are

    దీర్ఘ చతురస్రం (rectangular) ఆకారపు గది యొక్క కొలతలను (dimensions) 4 మీటర్లు పెంచినపుడు 4:3 నిష్పత్తిలోను, 4 మీ తగ్గించినపుడు 2:1 నిష్పత్తి లోను ఉన్నవి. ఆ గది యొక్క కొలతలు అయిన

    Show answer

    Answer: 12 m and 8 m

    సమాధానం: 12 మీ మరియు 8 మీ

    Check: 16 : 12 = 4 : 3 and 8 : 4 = 2 : 1.

  14. Mains 2019 · P-I · Q73 · Mental Ability · Arithmetic

    The total emoluments of A and B are equal. However, A gets 65% of his basic salary as allowance and B gets 80% of his basic salary as allowance. What is the ratio of the basic salaries of A and B?

    A మరియు B ల మొత్తం కూడుదల (total emolument) లు సమానము. A యొక్క మౌలిక జీతము (Basic salary) లో 65% బత్తెము (allowance) గా A పొందును మరియు B యొక్క మౌలిక జీతములో 80% బత్తెముగా B పొందును. A మరియు B యొక్క మౌలిక జీతముల యొక్క నిష్పత్తి ఎంత ?

    Show answer

    Answer: 12 : 11

    సమాధానం: 12 : 11

    1.65A = 1.80B, so A : B = 180 : 165 = 12 : 11.

  15. Mains 2019 · P-I · Q74 · Mental Ability · Arithmetic

    The average temperature from Monday to Thursday is 48° and from Tuesday to Friday is 52°. If the temperature on Monday is 42°, what was it on Friday?

    సోమవారం (Monday) నుండి గురువారం (Thursday) వరకు సగటు ఉష్ణోగ్రత (temperature) 48°. మరియు మంగళవారం (Tuesday) నుండి శుక్రవారం (Friday) వరకు సగటు ఉష్ణోగ్రత 52° అయినది. సోమవారం ఉష్ణోగ్రత 42° అయితే శుక్రవారం రోజు ఎంత ?

    Show answer

    Answer: 58°

    సమాధానం: 58°

    Friday – Monday = 4 × (52 – 48) = 16, so Friday = 42 + 16 = 58°.

  16. Mains 2019 · P-I · Q75 · Mental Ability · Arithmetic

    The batting average of 40 innings of a cricket player is 50 runs. His highest score exceeds his lowest score by 172 runs. If these two innings are excluded, the average of the remaining 38 innings is 48. His highest score was

    క్రికెట్ (cricket) ఆటగాడి 40 విడతల (innings) లో సరాసరి బ్యాటింగ్ (batting average) 50 పరుగులు (runs). అతని మిక్కిలి ఎక్కువ పరుగుల సంఖ్య (high score/score) అనునది, అతని మిక్కిలి తక్కువ పరుగుల సంఖ్య (low score/score) కంటే 172 ఎక్కువ. అతని అత్యధిక పరుగుల ఇన్నింగ్స్ సంఖ్య మరియు తక్కువ పరుగుల ఇన్నింగ్స్ సంఖ్య లను తొలగించిన తర్వాత మిగిలిన 38 పరుగుల యొక్క సరాసరి 48 అవుతుంది. అతని ఎక్కువ (high) పరుగుల సంఖ్య (score) కు అయిన సమానమయిన విలువ.

    Show answer

    Answer: 174

    సమాధానం: 174

    The two innings total 2000 – 1824 = 176 and differ by 172, so the highest score is (176 + 172) ÷ 2 = 174.

  17. Mains 2019 · P-I · Q76 · Mental Ability · Arithmetic

    A vendor sells 60% of the apples he had and throws away 15% of the remainder. Next day he sells 50% of the remainder and throws away the rest. What percent of his apples does the vendor throw away?

    ఒక అమ్మకం దారు (Vendor) తన వద్ద ఉన్న యాపిల్ పండ్లు (apples) లో 60% అమ్మి, మిగిలిన వాటిలో 15% పారవేయుట (throws away) చేస్తాడు. రెండవ రోజు మిగిలిన వాటిలో 50% అమ్మి మిగిలిన వాటిని పారవేస్తాడు. ఆ అమ్మకం దారు ఎంత శాతం యాపిల్ పండ్లను పారవేశాడు.

    Show answer

    Answer: 23%

    సమాధానం: 23%

    Out of 100 apples he sells 60, throws away 6 of the 40 left, then sells 17 of the 34 and throws away 17. He throws away 6 + 17 = 23%.

  18. Mains 2019 · P-I · Q77 · Mental Ability · Arithmetic

    The price of petrol is increased by 25%. By how much percent must a car owner reduce his consumption so as not to increase his expenditure on petrol?

    పెట్రోలు (petrol) ధర 25% పెరిగినది, ఒక కారు (car) యజమాని పెట్రోలు వాడకాన్ని ఎంత శాతం తగ్గిస్తే పెట్రోలుపై అతని ఖర్చు (expenditure) పెరగకుండా ఉంటుంది ?

    Show answer

    Answer: 20%

    సమాధానం: 20%

    The cut needed is 25/125 × 100 = 20%.

Data Interpretation & Statistics

  1. Screening 2019 · Q16 · Mental Ability · Data Interpretation & Statistics

    What represents the frequency of occurrence of specific phenomena that lie within a specific range of values, arranged in consecutive and fixed intervals?

    తరచుగా సంభవించే నిర్దిష్ట దృగ్విషయం, ప్రత్యేక కొలతలతో, విలువలతో, వరుసగా మరియు నిర్ణీతమైన విరామాలతో ఉంటే దాన్ని ఏది ప్రాతినిధ్యం వహిస్తుంది ?

    Show answer

    Answer: Histogram

    సమాధానం: హిస్టోగ్రామ్

    A histogram plots how many observations fall into each class interval, with adjoining bars whose areas represent the frequencies.

  2. Screening 2019 · Q42 · Mental Ability · Data Interpretation & Statistics

    For a moderately skewed distribution, what is the empirical relationship between Mean, Median and Mode?

    మధ్యస్థంగావక్రీకరించిన విపణి, ఏ అనుభావిక సంబంధం మీన్, మీడియన్, మోడ్లమధ్య కలిగి ఉంటుంది ?

    Show answer

    Answer: Mean – Mode = 3(Mean – Median)

    సమాధానం: మీన్ – మోడ్ = 3(మీన్ – మీడియన్)

    Karl Pearson's empirical rule is Mode = 3 Median – 2 Mean, which rearranges to Mean – Mode = 3(Mean – Median).

  3. Mains 2019 · P-I · Q4 · Mental Ability · Data Interpretation & Statistics

    The square root of variance is

    వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్–

    Show answer

    Answer: Standard deviation

    సమాధానం: స్టాండర్డ్ డివియేషన్

    Variance is the mean of squared deviations from the mean, and its square root, the standard deviation, is in the same units as the data.

  4. Mains 2019 · P-I · Q26 · Mental Ability · Data Interpretation & Statistics

    Validity in scientific research means

    శాస్త్ర పరిశోధనలో వ్యాలిడిటి అంటే అర్థం, ఆ అధ్యయనం -

    Show answer

    Answer: The results of the study can be generalised

    సమాధానం: అధ్యయనపు ఫలితాన్ని సాధారణీకరించవచ్చు

    The key defines validity as the extent to which findings hold beyond the study (external validity). Reliability, by contrast, is the consistency of measurement.

  5. Mains 2019 · P-I · Q28 · Mental Ability · Data Interpretation & Statistics

    Assertion (A): Measures of centrality are statistical tools. Reason (R): They help in deriving numerical information about the data.

    ప్రకటన: సెంట్రల్టీ కొలతలు అనేవి స్టాటిస్టికల్ పరికరాలు. హేతువు (రీజన్) : అవి డేటాకు సంబంధించి సంఖ్యా సంబంధ సమాచారాన్ని తీసుకోవటంలో సహకరిస్తాయి.

    Show answer

    Answer: Both A and R are correct and R is the correct explanation of A

    సమాధానం: ఎ ఆర్ రెండు సరైనవి. అయితే ఆర్ అనేది ఎ కి సరైన వివరణ

    Mean, median and mode summarise data in one representative number, which is why they are useful statistical tools.